వీర్నపల్లి మండలం ఐకేపీ కార్యాలయంలో ఉమ్మడి గర్జనపల్లి, అడవి పదిర, వన్ పల్లి గ్రామాల సీసీ గా విధులు నిర్వర్తిస్తున్న శ్యామల ను ఉత్తమ ఉద్యోగి రాలుగా గుర్తించి, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా ప్రశంసపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీసీ శ్యామల మాట్లాడుతూ.. ప్రశంస పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎంపిక చేసిన ఉన్నత అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. అవార్డు రావడం మరింత బాధ్యత పెంచిందని అన్నారు.