చిన్నపాటి వ్యవసాయ కుటుంబం నుంచి ఎస్ఐ ఉద్యోగం..

– ఎస్ఐ ఫలితలలో మెరిసిన పేదింటి విద్యా కుసుమం
– నేటి యువతకు ఆదర్శం
– అధికారులు, రాజకీయ నాయకులు సహాయ సౌకర్యాలు అందిస్తే  ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధిస్తా
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
తాజాగా వెలువడిన సివిల్ ఎస్సై ఫలితాల్లో  చిన్నపాటి రైతు కుటుంబానికి చెందిన విద్యార్థిని తన ప్రతిభ కనబరిచింది.తనను స్ఫూర్తిగా తీసుకుని యువత మంచి ఉద్యోగాలు సాధించాలని అంటోంది నాందిరి జ్యోతి. తనకు ప్రభుత్వం సహాయం సహకారాలు అందిస్తే ఉన్నత స్థాయికి చేరి మరెందరో యువతకు జ్యోతి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని సర్పంచ్ తౌడ శ్రీనివాస్, గ్రామస్తులు , జ్యోతి తల్లిదండ్రులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చికోడ్ గ్రామానికి చెందిన నాందిరి రాజయ్య, సత్తవ్వల కూతురు నాందిరి జ్యోతి ఇటీవల సివిల్  ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎస్ ఐ గా సెలెక్ట్ అయ్యింది. చిన్నప్పటి నుంచి చీకొడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించింది. ఆతర్వాత దుబ్బాకలో ఇంటర్ చదివి, సిద్దిపేటలో డిగ్రీ పూర్తి చేసింది. ఐతే ఇటీవల 2022లో ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లో  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా పరీక్ష వ్రాసి,వేలాది సంఖ్యలో ఉన్న పోటీని ఎదుర్కొని సబ్ ఇన్స్పెక్టర్ గా  అర్హత సాధించింది. దీంతో జ్యోతికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ఎదురైన పోటీ పరీక్షలు రాసి ఎస్ఐ ఉద్యోగం సాధించా… జ్యోతి
గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను.గత రెండు సంవత్సరాల నుండి ఎదురైన అన్ని ప్రభుత్వ  పోటీ పరీక్షలు వ్రాస్తూ (మేధస్సును) టాలెంట్ ను పెంచుకుంది. ఎలాంటి స్పెషల్ కోచింగ్ లు లేకుండా స్వయం మేదా సంపత్తితో ఎస్ ఐ ఉద్యోగం సంపాదించాను. నా ప్రతిభ గుర్తించి అందరూ అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాకు జాబ్ రావడానికి కారణం నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారు నన్ను చదివించడానికి పడ్డ కష్టమే. ప్రతి ఒక్క పేదింటి కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువత  అధైర్య పడొద్దు. పట్టుదలతోచదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలి. నాకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తే మరింత
ఉన్నత స్థాయి ఉద్యోగానికి కృషి చేస్తాను.
గ్రామంలోని యువతకు జ్యోతే ఆదర్శం సర్పంచ్ తౌడ శ్రీనివాస్ 
చిన్నపాటి రైతు కుటుంబంలో పుట్టి ఎస్ఐ ఉద్యోగం సాధించిన జ్యోతికి, వారీ తల్లితండ్రులకు కృతజ్ఞతలు.ఆమె ప్రతిభతో ఊరు పేరును జిల్లా ,రాష్ట్ర స్థాయిలో కనబరిచింది. నేడు గ్రామంలోని నిరుద్యోగ యువత జ్యోతిని ఆదర్శంగా తీసుకుని మంచి చదువులు చదివి ఎస్ఐ, సీఐ , ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి ఊరికి యువత మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నాను
ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి గ్రామస్తులు, తల్లిదండ్రులు
చిన్నప్పటి నుంచి జ్యోతి కష్టపడి చదివింది. ఎస్ఐ ఉద్యోగం సాధించడం సంతోషకరంగా ఉంది.  ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తే జ్యోతి మరింత ఉన్నత స్థాయి ఉద్యోగానికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించడం చికోడ్  గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.