ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ

నవతెలంగాణ-భిక్కనూర్:
జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలు తీసుకున్న సింధు శర్మను భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన జిల్లా ఎస్పీ కి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే స్పందించాలని ఆమె తెలిపారు.