కాశ్మీర్‌లో ఎస్‌ఐఏ సోదాలు

– సోషల్‌ మీడియా దుర్వినియోగం పేరుతో…
శ్రీనగర్‌: సోషల్‌ మీడియా దుర్వి నియోగానికి సంబంధించిన కేసులో జమ్ముకాశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎస్‌ఐఏ) మంగళవారం సోదాలు జరి పింది. లోయలోని నాలుగు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నట్టు అధికారులు తెలిపారు. పలు మొబైల్‌ ఫోన్స్‌, సిమ్‌ కార్డులతో పాటు ఇతర డిజిటల్‌ వస్తువులను సీజ్‌ చేసినట్టు వివరించారు. వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేర్పా టువాద, భారత వ్యతిరేక భావాలను ప్రచారం చేయడంలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, బృందాలను గుర్తించే లక్ష్యంతో ఈ సోదాలు చేపట్టినట్టు తెలిపారు.
కుప్వారా, అనంతనాగ్‌, పుల్వామా, శ్రీనగర్‌ జిల్లాల్లో ఎస్‌ఐఎ బందాలు సోదాలు జరిపాయని అన్నారు. భారతదేశంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సోషల్‌ మీడియా సంస్థలు తమ విదేశీ సహచరులకు సహకరిస్తున్నాయన్న ఎస్‌ఐఎ కాశ్మీర్‌ ఫిర్యాదు మేరకు ఈకేసును నమోదు చేసినట్టు తెలిపింది.