కొత్త పార్లమెంట్‌కు సిగ్నిఫై లైటింగ్‌ సొల్యూషన్స్‌

న్యూఢిల్లీ : ప్రముఖ లైటింగ్‌ ఉత్పత్తుల కంపెనీ సిగ్నిఫై కొత్త పార్లమెంట్‌కు పలు లైటింగ్‌ సొల్యూషన్స్‌ అందించినట్టు తెలిపింది. టాటా ప్రాజెక్ట్స్‌తో కలిసి ఈపీసీ ప్రాతిపదికన ప్రధాన కాంట్రాక్టర్టుగా వ్యవహారించినట్టు పేర్కొంది. కొత్త భవనానికి 1200 కన్నా ఎక్కువ ఫిలిప్స్‌ లూమినైర్‌లను ఉపయోగించినట్టు తెలిపింది. మమూత్‌ త్రిభుజాకార భవనంలోని అశోక్‌ స్తంభం, బాహ్య, అంతర్గత ముఖభాగాలు వంటి అనేక ప్రముఖ విభాగాలను ప్రకాశవంతం చేసినట్టు పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభల ప్రధాన ఫంక్షనల్‌ ఇంటీరియర్‌ లైటింగ్‌ను కూడా తామే చేపట్టామని సిగ్నిఫై దక్షిణాసియా సీఈఓ సుమిత్‌ జోషి తెలిపారు.