హైదరాబాద్ : ప్రపంచంలోని ప్రముఖ ఏఐ, ఐపీ ఆధారిత డిజిటల్ అస్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్ హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో కొత్త ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఓడీసీ)ని ప్రారంభించింది. దీన్ని సిగ్నిటీ చైర్మెన్ సివి సుబ్రమణ్యం, సీఈఓ శ్రీకాంత్ చక్కిలం లాంచనంగా ప్రారంభించారు. ప్రస్తుత 2 లక్షల చదరపు అడుగులకు అదనంగా, దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా ప్రారంభించబడిన ఈ ఆఫీస్ స్పేస్‌లో 400 మంది నిపుణులు సౌకర్యవంతంగా పని చేయవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ విస్తరణ మా సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా మా ఉద్యోగులకు ప్రపంచ స్థాయి పని వాతావరణాన్ని అందించడంలో మా నిబద్ధతను కూడా నొక్కి చెబుతుందని శ్రీకాంత్ చక్కిలం పేర్కొన్నారు.