సాదాసీదాగా మండల సభ

– సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-పర్వతగిరి
పర్వతగిరి మండల కేంద్రంలోని స్థానిక మదర్‌ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మండల సర్వ సభ్య సభను ఎంపీపీ కమల అధ్యక్షతన నిర్వహించారు. కానీ ఈ సభ నత్త నడకన పేరుకు మాత్రమే జరిగింది. ఎప్పటిలాగే అధికారులు కేవలం వారి పని తీరును నివేదికల రూపం లో బాగంగా చదివి విని పించారు తప్పా…! వారు చేసిందేమీ లేదని ఆయా గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రతిసారి గ్రామాల్లోని సమస్యలను మీటింగ్‌ లో ఆఫీసర్లుకు చెప్పినప్పటికి వాటి పరిష్కారం కావడం లేదని సభ్యులు ఆవేధన వ్యక్తం చేశారు. చెరువుకొమ్ము తండాలో మిడిల్‌ ఫోల్స్‌ లేవని ప్రతిసారి సభలో వారి దృష్టికి తీసుకు వచ్చిన విద్యుత్తు శాఖ అధికారులు పొంతన లేని సమాధా నాలు చెబుతూ పట్టించుకోవడం లేదని సర్పంచి దేశిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గాలివాన బీభత్సానికి కరెంటు పోతే నాలుగు రోజులైన వస్తలేదని, చెట్టుకొమ్మలు కొట్టించడానికి తాను సిబ్బందిని ఇస్తానని కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని గోరుగుట్టతండా సర్పంచ్‌ వెంకతేశ్వర్లు తెలిపారు. ఏనుగల్లు శివారు తూర్పుతండాలో సవారికుంట సుందరీకరణ పనులు 2సంవత్సరాల నుంచి చేపడుతున్నారని వారం రోజుల్లో పూర్తి చేయకుంటే సంబంధిత ఏ ఈ లు సంధ్యారాణి,ప్రశాంత్‌ లపై ఐబీ జిల్లా అధికారులకు కు ఫిర్యాదు చేస్తానని జడ్పీటీసీ సింగులాల్‌ ఏఈల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంకపాక ఊరచెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ మోహన్‌ రావు తహసీల్దార్‌ కోమి అజ్మీరా దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామాల వీఆర్‌ఏలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆ యా గ్రామాల సర్పంచులు రమేశ్‌, వెంకన్న తహసీల్దార్‌ కోమి దష్టికి తీసుకెళ్లారు. పర్వతగిరిలో ఉన్న రేషన్‌ షాపును దౌలత్‌ నగర్‌ లో డీలర్‌ నిర్వహిస్తున్నాడని అట్టి రేషన్‌ షాపును ఇక్కడే నిర్వహించాలని ఎంపీటీసీ మహేంధ్ర కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు జరగక పోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి కాంటాలు నిర్వహించేలా చూడాలని ఎంపీటీసీలు రమేశ్‌,బోట్ల మహేంద్ర సభ దష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సాకులు చెప్పి తాలు, తరుగు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగులాల్‌, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌ రావు, ఎంపీడీవో చక్రాల సంతోష్‌ కుమార్‌ , తహసీల్దార్‌ కోమి అజ్మీరా,జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మహమ్మద్‌సర్వర్‌, సొసైటీ చైర్మన్లు మనోజ్‌ కుమార్‌, దేవేందర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు ఏకాంతం, రతన్‌ రావు, రైతుసమన్వయ సమతి మండల కన్వీనర్‌ చిన్నపాక శ్రీనివాస్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గైర్హాజరైన అధికారుల పై చర్య లేవి…?
మండలంలోని ఆయా గ్రామాల్లో పేరుకుపోతున్న ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యం తో ప్రతి మూడు నెలల కు ఒకసారి మండల సర్వ సభ్య సభ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కానీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా మాకెందుకు లే అన్నట్లుగా కొంతమంది అధికారులు సభలకు గైర్హాజరౌతునప్పటికి వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.సంబంధిత ఉన్నత అధికారులు గైర్హా జరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు, మేధా వులు,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.