సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ జూన్‌ 1 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ : ఎక్సైజ్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం జూన్‌ 1 వరకు పొడిగించింది. ఈ సందర్భంగా సిసోడియాకు జైలులో కుర్చీ, టేబుల్‌, పుస్తకాలు అందించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయ మూర్తి జైలు అధికారులను ఆదేశించారు. ఇక సిసోడియాను ఢిల్లీ కోర్టు నుంచి బయటకు తీసుకు వస్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సర్వీసెస్‌ విషయంలో కేంద్రం ఆర్డినెన్స్‌ను భర్తీ చేసే బిల్లును ప్రస్తావిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. మోడీ చాలా అహంకారిగా మారారు’ అని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీని 2021 నవంబర్‌ 17న అమల్లోకి తెచ్చింది. అయితే అవినీతి ఆరోపణల కారణంగా 2022 సెప్టెం బర్‌ చివరలో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీలు పెట్టిన కేసుల్లో సిసోడియా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.