నవతెలంగాణ- కోహెడ:
మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేది వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, నాంది దేవత ఆహ్వానము, మండపారాధన, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రసాదరావు శర్మ తెలిపారు. అలాగే నేడు ఉదయం పోచమ్మతల్లి విగ్రహా ప్రతిష్టాపన జరుగుతుందని పేర్కోన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గోని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.