– మాజీ మంత్రి జూపల్లి
– సోనియమ్మ మాట ఇచ్చింది
– కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది.
నవతెలంగాణ- చిన్నంబావి
చిన్నంబావి మండలం వెల్ టూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా లికాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు జూపల్లి కష్ణారావు గారులి ఆరు గ్యారెంటీ లను గ్రామ ప్రజలకు, మహిళలకు వివరిస్తూ వాటి వలన సామాన్య ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో వివరించారు.తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా విజయ భేరి సభలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారు అని,రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని జూపల్లి గారు ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జూపల్లి గారి దష్టికి వివిధ సమస్యలను తీసుకు వస్తు గ్రామంలో ఇందిరమ్మ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని,కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే ఇప్పటికీ ఉన్నాయని వారు అన్నారు. ఏదైనా దవాఖాన కు పోతే ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే చూయించుకుంటున్నామని, అలాంటి మంచి పనులు మరింత ఎక్కువ సహాయపడేల చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని ఆనాటి సంక్షేమ పథకాల వల్ల వారు పొందిన లబ్ధినీ గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో చిన్నం బావి మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మహిళ కాంగ్రెస్ నాయకులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.