– జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి ఆరుగురు ఎంపిక
హైదరాబాద్: మహారాష్ట్ర వేదికగా నేటి నుంచి షురూ కానున్న జాతీయ మహిళల సాఫ్ట్‌బాల్ టోర్నీకి లక్షేట్టిపేట గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి చెందిన ఆరుగురు క్రీడాకారిణీలు ఎంపికయ్యారు. రాష్ట్ర జట్టులో భూమిక, శాలిని, స్ఫూర్తి, స్నేహ, స్వాతి, లక్ష్మి ఉన్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ లలితా కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గురుకుల ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబర్చి జాతీయ టోర్నీకి ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. ఉమహేశ్వర్‌రావు, మౌనిక, మల్లిక, మమత, గురుకుల సిబ్బంది క్రీడాకారిణీలను అభినందించారు.