నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు 

ఎస్.జీ.ఎఫ్ క్రీడల ముగింపు సమావేశంలో ఎంపీడీఓ రాము
ఎస్.జీ.ఎఫ్ క్రీడల ముగింపు సమావేశంలో ఎంపీడీఓ రాము
– ఎస్.జీ.ఎఫ్ క్రీడల ముగింపు సమావేశంలో ఎంపీడీఓ రాము 
– ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
నవతెలంగాణ-బెజ్జంకి 
విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని ఎంపీడీఓ దమ్మని రాము విద్యార్థులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఎస్.జీ.ఎఫ్ క్రీడల ముగింపు సమావేశానికి ఎంపీడీఓ రాము ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఎంఈఓ పావనితో కలిసి ప్రధానోత్సవం చేశారు.జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కో ఆర్డినేటర్ వాసవి,నాగరాజు,పద్మ,లావణ్య,శ్వేత, పీఈటీ కనకా రెడ్డీ పాల్గొన్నారు.