నవతెలంగాణ-హన్మకొండ
పేద ప్రజలకు 58 జీవో ప్రకారం పేద ప్రజలకు పట్టాలు వచ్చేంతవరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్ గుడిసె వాసుల వెన్నంటే ఉండా లని సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ కార్యదర్శి మంద సంపత్ అన్నారు. ఆదివారం 31 వ డివిజన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం గుడిసేవాసులతో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. వారికి 58 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే వినరు భాస్కర్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరి ష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రోజువారీ కూలీలుగా, ఇండ్లల్లో పని చేసుకుంటూ, సిటీకి వలస వచ్చిన పేదలు ఉన్నారు. దిన్ దాయాలనగర్, మహాత్మా జ్యోతిరావు పూలే నగర్, కోట చెరువు, ప్రగతినగర్, బంధం చెరువు లలో వేల సంఖ్యలో సంవత్సరాల తరబడి జీవనం కొనసాగి స్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లడం తో పాటు జీవో కన్వెర్షన్ చేసి పెదలందరికి పట్టాలు వచ్చేవిదంగా కృషి చేయాలని అన్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సౌత్ మండల కమిటీ సభ్యులు నోముల కిషోర్, కంచర్ల కుమరస్వామి, ఎన్నాం వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, సంపత్, దుర్గ, అనిత, రాణి, రమ తదితరులు పాల్గొన్నారు.