– రన్నరప్స్‌గా యశ్వి జైన్, సాత్విక్ డిఎస్‌ఎస్‌యు
హైదరాబాద్: మూడురోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఫిడె 1600 రేటింగ్ చెస్ మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో అమెరికా, కెనడా, యెమన్ సహా భారత్ నుంచి 15 రాష్ట్ర్రాల చెస్ క్రీడాకారులు పోటీపడ్డారు. 575 మంది పాల్గొన్న స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ చాంపియన్‌గా బిహార్‌కు చెందిన శుభమ్ కుమార్ విజేతగా నిలిచాడు. తెలంగాణ అమ్మాయి యశ్వి జైన్ ద్వితీయ స్థానంలో నిలువగా, ఆంధ్రపదేశ్‌కు చెందిన సాత్విక్ డిఎస్‌ఎస్‌యు తతీయ స్థానంలో నిలిచారు. యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. విజేత రూ.1 లక్ష, రన్నరప్ రూ.60 వేలు, సెకండ్ రన్నరప్ రూ.40 వేలు నగదు బహుమతి దక్కించుకున్నట్లు నిర్వాహకులు, స్లాన్ స్పోర్ట్స్ సీఓఓ నవీన్ నాయక్ తెలిపారు.