– భయంతో ప్రయాణికుల పరుగులు
– మరమ్మతులు చేపట్టి, యథాతధంగా ప్రయాణం
నవతెలంగాణ-కురవి
సికింద్రాబాద్-విజయవాడ మీదుగా హౌరా వెళ్లే ఈస్ట్‌కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉన్నట్టుండి పొగలు రావడంతో మరమ్మత్తులు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ రైతు మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 12:45 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో బ్రైక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును వెంటనే నిలిపివేశారు. ప్రయాణికులు భయంతో రైల్లోంచి దిగి పరుగులు తీశారు. కాగా, రైలులో సాంకేతిక లోపాలను సరి చేయడంతో యథాతథంగా రైలు వెళ్ళిపోయినట్టు స్టేషన్ గార్డు తెలిపారు.