జీవితాలకే పొగ పెడుతుంది

పొగాకు దుష్ప్రభావాలపై అవగాహనకు ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కె రన్‌ 5 నుంచి 80 ఏండ్ల వయసు వారి వరకు 800 మందికి పైగా పరుగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సంద ర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం 5కె రన్‌, వాక్‌ నిర్వహించారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ రన్‌లో ఐదేండ్ల నుంచి 80 ఏండ్ల వయసు వరకు ఉన్న పలు వర్గాల ప్రజలు 800 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీవీఎస్‌ సోమరాజు మాట్లాడుతూ ”పొగాకు వాడటం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాల తో పాటు అది వాడకపోతే వచ్చే లాభాల గురించి కూడా కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి పరిసర ప్రాంత వాసులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నే ఈ 5కె రన్‌ నిర్వహించాం. ఇంత పెద్ద సంఖ్యలో, అది కూడా అన్ని వయసుల వారు ఇందులో పాల్గొ న్నందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. పొగాకు వాడకం వల్ల గుండె సమస్యలు, నాడీ సమస్యలు, మూ త్రపిండాల సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సారి మనకు పొగాకు వద్దు.. ఆహారం కావాలి అనే థీమ్‌ తీసుకుంది. ప్రపంచంలో చాలా మంది అన్నపానీయా లు లేక అలమటిస్తున్నారు. అలాంటివారిని ఆదుకునేం దుకు ముందుకు రావాలి. పొగాకును మన దేశంలో వివిధ రూపాల్లో తీసుకుంటారు. సిగరెట్లు, చుట్టల నుంచి గుట్కా, తంబాకు వరకు.. ఇలా రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. వీటివల్ల వచ్చే సమస్యలను చెబు తున్నాం. యువత కూడా వీటికి ఎక్కువగా అలవాటు పడటం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. కొత్త తరం ఈ మహమ్మారిబారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అలవాటు ఉన్నవారు మానేయడంతో పాటు, కొత్తగా ఎవరూ అలవాటు చేసుకోకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం. అలా ఆదా అయ్యే డబ్బుల్లో కొంతభాగమె ౖనా మన చుట్టూ సమాజంలో ఉన్నవారి ఆకలి తీర్చడా నికి ఉపయోగపడితే అదే పదివేలు” అని చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణం నుంచి మొదలుపెట్టి, నిజాంపేట మెట్రో వాటర్‌వర్క్స్‌ వరకు, తిరిగి అక్కడినుంచి ఆస్పత్రికి ఈ పరుగును నిర్వహించినట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ యశ్వంత్‌ వర్మ తెలిపారు. యువత పొగాకు అలవాటును వదిలిపెట్టాలనీ, రాబోయే తరాల వారు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. చిన్నపిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో తమ ఉద్దేశం చాలావరకు నెరవేరినట్లే భావిస్తున్నామన్నారు.