నవతెలంగాణ-ఆలేరురూరల్
మండలంలో జరిగిన ఉపాధిహామీ పనులపై ఆలేరు మండలంలోని 13 విడత సోషల్ ఆడిట్ ప్రజా వేదిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పెషల్ కమిషనర్ ప్రదీప్ ,డి ఆర్ డి ఓ నాగిరెడ్డి హాజరై మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ అమలులో వేతనాలను జరిగిన పనులలో పొరపాట్లను గుర్తించారు. గ్రామాలలో ఉపాధి హామీ పని ఎంత జరిగింది డబ్బులు ఎంత మందికి రావాలి అనే విషయాలపై చర్చించారు. మొక్కలు ఎన్ని నాటారు.. ఎన్ని చనిపోయాయి ఎన్ని రక్షించగలిగారు అనే అంశంపై ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు, చేసిన పనికి పెండింగు బిల్లులు ఎంత రావాలి ఎంతోమందికి రావాలి అనే విషయంపై అధికారులు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి సుబ్రహ్మణ్యం ,జెడ్పిటిసి నాగేష్ ,ఏపీ డి శ్యామల ,ఏవివో చండీ రాణి, విజిలెన్స్ మేనేజర్ ఆర్య వర్ధన్ ,హెచ్ ఆర్ మేనేజర్ సంపత్ కుమార్ ,ఎస్‌ఆర్పి రవికుమార్ ,ఏపీవో వెంకట కిషన్ ,టెక్నికల్ అసిస్టెంట్ లు చారి ,మానస పంచాయతీ కార్యదర్ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ,సోషల్ ఆడిట్ రిసోర్స్ పర్సన్స్ ,తదితరులు పాల్గొన్నారు.33వ సారి పాల సంఘం చైర్మెన్‌గా బీర్ల ఐలయ్యనవతెలంగాణ- యాదగిరిగుట్టరూరల్ యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో శుక్రవారం 33 వ సారి పాల సంఘం చైర్మన్ గా టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పాడి రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సైదాపూర్ కే కాకుండా మీ ఆశీర్వాదం తో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సేవ చేసే అవకాశం కల్పించిన రైతుల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.సాదాసీదాగా సర్వసభ్య సమావేశం నవతెలంగాణ -బీబీనగర్ మండల అభివద్ధిపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వంచే సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ యెర్కల సుదాకర్ గౌడ అధ్యక్షతన ఎంపీడీలో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సందర్భంగా అధికారులు అందచేసిన అభివృద్ధి నివేదిక లపై ప్రజప్రతినిదులు పలు అభ్యంతారాలు తెలిపారు. దీని పై ఎంపీపీ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు అధికారులు ప్రజప్రతినిధులతో కలిసి పాలుపంచుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ శ్రీవాణి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.