సోనియాకు అనారోగ్యం

– ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌లో చికిత్స
– పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆమె వైద్యుల పరిశీలనలోనే ఉన్నారు. ఇటీవల గతనెల 31న ముంబయిలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశానికి ఆమె, తన కుమారుడు రాహుల్‌ గాంధీతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఆమె ఇప్పటి వరకు రెండు సార్లు ఆస్పత్రిలో చేరటం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఇన్ఫెక్షన్‌ కారణంగా, మార్చిలో జ్వరం కారణంగా సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.