తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించిన సోనియా…!

నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ నాటి యూపీఏ చైర్పర్సన్‌ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్‌ మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ముందు వరుసలో లేకుంటే ఉద్యమం నిరుగారుతుందని ఆనాడు కేసీఆర్‌తో పాటు అనేక సంఘాలు కాంగ్రెస్‌ పార్టీకి విజ్ఞప్తి చేసింది సంగతి తెలిసిందే అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజల తరపున ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పరిపాలన రావడానికి,పరిపాలన చేయడానికి,అభివద్ధి సాధించడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, రామకష్ణరెడ్డి, రంగారెడ్డి, జంగయ్య, బాలాజీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రామారావు, మండల నాయకులు మేకల జగన్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, బండి హనుమంతు, పోలే జంగయ్య, కొట్టం శ్రీనివాస్‌, కొండూరు జంగయ్య, భీమగోని యాదయ్య, జిల్లా శేఖర్‌, ఇడగోని కృష్ణయ్య, తమ్మడపల్లి గ్రామశాఖ అధ్యక్షులు ఇడగోని వెంకటేశ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజీవ్‌ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజీవ్‌ చౌరస్తాలో సోనియమ్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. సోనియా దయతోనే తెలంగాణ సిద్దించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎంపీపీ సునీత కృపయ్య, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పీసీసీ సభ్యులు చిరుమర్తి కృష్ణయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్జున్‌, కౌన్సిలర్లు దేశిడి శేఖర్‌రెడ్డి , గంధం రామకృష్ణ, క్రికెటర్‌ జానీ, గుంజ శ్రీను, మండల నాయకులు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి గుండు నరేందర్‌ బసవయ్య గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ పాలూరి ప్రసాద్‌, బల్గూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర : తెలంగాణా ప్రజల పోరాటాన్ని అమరుల త్యాగాలను అర్ధం చేసుకుని ఆంధ్రా పాలకుల ఒత్తిడిలను తట్టుకొని ఎన్నో ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చినా మాటకి కట్టుబడి 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసినా తల్లి సోనియాగాంధీ చిత్రపటానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దవూర మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కర్నాటి లింగారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌ నాయక్‌, మండల పార్టీ అధ్యక్షుడు పబ్బు యాదగిరిగౌడ్‌, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిలారి మురళియాదవ్‌, నియోజకవర్గ కార్యదర్శి ఐతగొని సతీష్‌, నడ్డి ఆంజనేయులు, కోట లక్ష్మయ్య, బైకని లక్ష్మయ్య, కాటపల్లి వెంకటయ్య, వూరేవెంకన్న, వూరే మల్లేష్‌ వూరే లక్ష్మణ్‌, మహ్మద్‌ రంజాన్‌, వూరే శేఖర్‌, తర్రి నాగరాజు, ఈద చిన్ని, రాజు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్‌ : తెలంగాణ ను ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి చిట్యాల పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్యయాదవ్‌ అధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు పోకల దేవదాసు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ఇబ్రహీం, రెముడాల మధు, జంపాల వెంకన్న, శ్రీశైలం, సీనియర్‌ నాయకులు ముప్ప ముత్తి రెడ్డి, గాలి యాదగిరి, బోడ స్వామి పాల్గొన్నారు.
నకిరేకల్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మెయిన్‌ సెంటర్‌లో జాతీయ జెండాను ఎగురవేసి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గాజుల సుకన్య, ధైద స్వప్న, బొబ్బలి నరసింహారెడ్డి, నామిరెడ్డి కృష్ణారెడ్డి, విజరు, ఎండి .రషీద్‌, సర్వర్‌ మియా పాల్గొన్నారు.
టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు చూడలేక యుపిఎ చైర్పర్సన్‌ సోనియా గాంధీ నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ప్రసన్న రాజ్‌, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, యాస కర్ణాకర్‌ రెడ్డి, పెండెం వెంకటయ్య, బొప్పని యాదగిరి, పల్‌ రెడ్డి ఉపేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.
వేదాస్‌ వెంకయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం
నాటి యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌ లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వేదాసు శ్రీధర్‌, నాయకులు, గుండా జలంధర్‌రెడ్డి, గుణగంటి రాజు గౌడ్‌, ఏ మహేందర్రెడ్డి, కోట పుల్లయ్య, కొత్తపల్లి సైదులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్‌ : మండల కేంద్రంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రమావత్‌ కృష్ణనాయక్‌, ప్రధాన కార్యదర్శి కలసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ నియోజవర్గ ఉపాధ్యక్షులు మేరావత్‌ మునినాయక్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల యూత్‌ అధ్యక్షులు అనుముల అంజి, సోషల్‌ మీడియా కన్వీనర్‌ పాండురంగ, బొమ్ము సాయి,భాస్కర్‌ రెడ్డి,వెంకన్న, ముని ఉపసర్పంచ్‌,యాదగిరి రెడ్డి, పిట్టల తిరుమల్‌, మాత్రు, తారాసింగ్‌, సరిరాం, మంగ్లా, నాగ, లక్ష్మణ్‌, గోపి నాథ్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి, సైదులు, రాజు, దేవీసింగ్‌, కపూర, జబ్బార్‌, బాలు,దేవు,దాసు, మంగు, తదితరులు పాల్గొన్నారు.