నవ తెలంగాణ- ఆలేరు టౌన్: సిసిఎస్ ఎన్నికలలో భాగంగా, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కి ఆలేరు పట్టణంలో గురువారం ఎన్నికలు జరగగా, పోటీలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. మజ్దూర్ యూనియన్ కు 12 మంది, సoగ్ 12 మంది, ఎస్సీ, ఎస్టీ 10, ఇండిపెండెంట్ ముగ్గురు, మొత్తం 37 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, సికింద్రాబాద్ డివిజనల్ ఎన్నికలలో, ఏడవ నెంబర్, బ్యాట్ గుర్తుపై బి. శ్రీనివాసు పోటీ చేశారు. 250 ఓట్ల గాను దాదాపు 200 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అభ్యర్థి విజయం కొరకు, యూనియన్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ప్రచారం నిర్వహించారు. రైల్వే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ చిలుగు. స్వామి, ఆలేరు బ్రాంచ్ చైర్మన్. తిరుపతిరావు, సెక్రటరీ. యలేందర్, డెలిగేట్, శ్రీనివాసు, ఇఎల్ఎస్ బ్రాంచ్ సెక్రటరీ, నరసింహా రెడ్డి, బత్తుల.కిరణ్, వతాళ. సుధాకర్, ట్రెజరర్. శ్రీశైలం, ముత్యం. అనీలు, ఆరూరి.వంశీధర్, తదితరులు పాల్గొన్నారు.