– శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలి
నవతెలంగాణ – సిరిసిల్ల
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్లలోని ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు వచ్చిన ప్రజలు అ పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తు అ పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, సామాజిక మాధ్యమల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన, ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.