స్పార్క్‌ లైఫ్‌ రిలీజ్‌కి రెడీ

Spark Life For release readyవిక్రాంత్‌ ఈ సినిమాతో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘స్పార్క్‌ లైఫ్‌’. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి కథను అందిస్తూ స్క్రీన్‌ ప్లేను అందించారు విక్రాంత్‌. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 17న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. నిర్మాత లీల మాట్లాడుతూ, ‘సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘అమెరికాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ చూసి కథను రాసుకున్నాను’ అని హీరో విక్రాంత్‌ తెలిపారు. ‘ఈ మూవీలో చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. సుహాసినితో నాకు రెండో సినిమా.విక్రాంత్‌ యాక్టర్‌ కావాలనే కలను నేరవేర్చుకుంటున్నారు. ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. నాకెరీర్‌కి ఉపయోగపడే పాత్ర ఇది. ఇలాంటి మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని మెహరీన్‌ అన్నారు.