నవ తెలంగాణ- రెంజల్ :రెంజల్ మండలంలోని దూపల్లి, కళ్యాపూర్, కూ నే పల్లి, బాగేపల్లి గ్రామాలలో పార్టీ బలోపేతానికి ముఖ్య కార్యకర్తలతో బిజెపి మండల అధ్యక్షులు గోపి కృష్ణ, బీజేపీ వైఎం అసెంబ్లీ కన్వీనర్ ఖ్యాతం యోగేష్, బీజేపీ సీనియర్ నాయకులు మేక సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు జరిపారు. కూనేపల్లి గ్రామంలో జిల్లా అధికార ప్రతినిధి కరణ్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలను కలిసి బీజేపీ పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గంగా దాస్, అశోక్ తదితరులు ఉన్నారు.