నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో బుధవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమము, నవగ్రహ హోమము, చండీ హోమము, మృత్యుంజయ హోమము, సంజీవని హోమము, సక్యత హోమము, శత రుద్రము, శత శెండీ పారాయణం అలాగే రుద్రాభిషేకం, పంచ ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ స్వయంభులింగ మహా క్షేత్ర ఆలయంలో ఉన్న లింగంను ఘనంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, పట్టణ సర్పంచ్ తునికి వేణు, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, భక్తులు, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.