
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ మండల కేంద్రంలో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యువకులు స్థానిక కసిర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.చంద్రయాన్-3 రాకెట్ దక్షిణ ధృవం పై క్షేమంగా దిగి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ…. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టె క్షణం కోసం యావత్ భారతదేశం అంతా ఎదురుచూస్తుందని పేర్కొన్నారు.చంద్రయాన్-3 విజయవంతంతో ఈరోజు సువర్ణ అక్షరాలతో ప్రపంచ పటంలో లిఖించదగ్గరోజని తెలిపారు.చంద్రయాన్-3 విజయవంతం ద్వారా భారత శక్తి, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసి వస్తుందని, ఇది మనకెంతో గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.