త్రిశక్తి పీఠ యాత్రకు ప్రత్యేక రైళ్లు..

– త్రివెల్‌ టైమ్స్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత్‌ గౌరవ్‌ పతకం కింద మహాలయ అమావాస్యకు త్రిశక్తి పీఠ యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు త్రివెల్‌ టైమ్స్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక రైల్‌ ప్రయాగ, వారణాసి, గయ, అయోధ్య, హరిద్వార్‌, ఢిల్లీ, మధుర, అగర్తలా తదితర ప్రదేశాల సందర్శనకు అనువుగా ప్రయాణిస్తున్నదన్నారు. వచ్చే నెల 10న రైల్‌ బయలుదేరనుందని తెలిపారు. ఈ ఉలా రైలులో దారి పొడవునా యాత్రా విశేషాలను వివరించేందుకు పీఏ సిస్టమ్‌, సీసీటీవీ కెమెరాలు, కోచ్‌ సెక్యూరిటీ, టూర్‌మేనేజర్లు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తదితర సదుపాయాలు ఉంటాయని తెలిపారు.స్లీపర్‌ (బడ్జెట్‌ ) రూ. 22,300, స్లీపర్‌(ఎకానమి) రూ.26,800,థర్డ్‌ఏసీ(స్టాండర్డ్‌)రూ.36,950 ధరల్లో ఉంటుందని తెలిపారు. వివరాల కోసం7876101010, అన్‌లైన్‌ బుకింగ్‌ కోసం షషష.తీaఱశ్ర్‌ీశీబతీఱరఎ.షశీఎ సంప్రదించాలని కోరారు.