వెల్నెస్ సెంటర్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలి

నవతెలంగాణ కంటేశ్వర్ :
వెల్నెస్ సెంటర్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, ఎంప్లాయిస్, పెన్షనర్స్, జర్నలిస్టుల, హెల్త్ స్కీము పరిధిలోని వెల్నెస్ సెంటర్ నందు కార్డియాలజీ, గైనిక్, తదితర స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి వెల్నెస్ సెంటర్ ను పటిష్ట పరచాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఈ.హెచ్.ఎస్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ కి(హైదరాబాద్) విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉన్న వెల్నెస్ సెంటర్ను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నకు మార్పుకు సంబంధించి వసతులు గురించి కలెక్టర్ తదితర జిల్లా స్థాయి అధికారులను కలిసేందుకు వారు నిజామాబాద్ కు వచ్చారు. యూనియన్ ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాట్లాడుతూ లబ్ధిదారులకు అన్ని రకాల టెస్టులను ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులనందు నగదు రహితంగా టెస్టులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్యాలయంలోనికి వెల్నెస్ సెంటర్ మార్పు కి సహకరించిన జిల్లా కలెక్టర్ కి, అడిషనల్ కలెక్టర్ కి, ప్రెస్ క్లబ్ నాయకత్వానికి పెన్షనర్స్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, పట్టణ అధ్యక్షులు సిర్ప హనుమాన్లు, అందే సాయిలు, జిల్లా నాయకులు ఈవియల్ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రాధాకృష్ణ, తదితరులు ఉన్నారు.