
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గల బషీరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో సోమవారం స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం క్రీడా పోటీలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు గంగారెడ్డి, బందేలా రాజు అధ్వర్యంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అన్ని యువజన సంఘలకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గంగారెడ్డి గ్రామంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే కబడ్డీ, వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణ వల్ల యువతలో క్రమశిక్షణ అలవాడి, ఒకరినొకరికి స్నేహభావం పెంపొందుతుందన్నారు. విజేతలకు స్వాతంత్ర దినోత్సవమైన మంగళవారం జెండా ఆవిష్కరణ అనంతరం బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని యువజన సంఘాలకు క్రీడ పోటీలు నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న బిఆర్ఎస్ నాయకులకు యువజన సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.