క్రీడా పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి..

– వైస్ ఎంపీపీ భూసని అంజయ్య
నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాడానికి, క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రకరకాల క్రీడా కిట్టు లను అందజేస్తుందని క్రిడాకారులు వాటన్నింటినీ సద్వినియోగం చేసుకుని మంచి ప్రతిభ వంతు క్రిడాకారులుగా ఎదగాలని వైస్ ఎంపీపీ భూసని అంజయ్య అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన క్రిడా పరికరాలను అయా గ్రామల పంచాయతీ కార్యదర్శులకు, క్రీడాకారులకు టీ షర్టు లను, బతుకమ్మ చిరలను మహిళలలకు ఎంపిడిఓ రాములు నాయక్ తో కలిసి అందజేశారు. ఈసందర్బంగా వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, ఎంపిడిఓ రాములు నాయక్ లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గత కొన్ని నెలల క్రితం గ్రామాలలో పల్లె క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు దానిలోనే క్రీడాకారులు క్రీడలు నిర్వహించుకోవడానికి కిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది దానిలో భాగంగానే ఆయా గ్రామాలలో ఈ కిట్లను అందజేయడం జరిగిందన్నారు. క్రీడ పరికరాలతో క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వీళ్ళకి తీయడం నాకు తర్వాత మంచి నైపుణ్యంతో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో  రాటు దేళాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్, ఎంపిఓ రాజ్ కాంత్ రావు, సీనియర్ అసిస్టెంట్ సీనియర్ నాయకులు రాజు నాయక్, గణేష్ నాయక్, ఏపిఎం సువర్ణ, సిసి ఉదయ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్, మహిళలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.