
స్పోర్ట్స్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, యూనివర్సిటీలో స్పోర్ట్స్ బోర్డ్ సమావేశం నిర్వహించే విధంగా చూడాలని, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా గ్రౌండ్ ను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని, అన్ని రకాల క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ పరికరాలు తీసుకురావాలని, యూనివర్సిటీ గ్రౌండ్ లో వాటర్ సదుపాయం కల్పించాలని, లైట్స్ ఏర్పాటు చేయాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో ఇంచార్జ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ నేత కు మంగళవారం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ యూనివర్సిటీ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, అన్ని రకాల క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ పరికరాలు తీసుకురావాలని, యూనివర్సిటీ గ్రౌండ్ లో వాటర్ సదుపాయం కల్పించాలని, లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకాష్, అక్షయ్ పాల్గొన్నారు.