ధ్యాన మందిర స్ట్రక్చర్ పనులు ప్రారంభం

నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని సుప్రసిద్ధ దేవస్థానం సిద్దుల గుట్ట నందు నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్”” శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం”” స్ట్రక్చర్ నిర్మాణ పనులను సోమవారం బ్రహ్మ విద్వారిష్ట శ్రీమతి తటవర్తి రాజ్యలక్ష్మి, అదేవిధంగా శ్రీ నందీశ్వర మహారాజ్ సిద్దుల గుట్ట, నియోజకవర్గ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారి సహోదరుడు శ్రీ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పండిత్ వినీత పవన్, పిరమిడ్ మాస్టర్లు, శ్రీ నవనాథ సిద్దిలగుట్ట ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి స్ట్రక్చర్ పనులను ఘనంగా ప్రారంభించడం జరిగింది.సిద్దుల గుట్టపై నిర్మిస్తున్న ఈ పిరమిడ్ ధ్యాన మందిరం ఎంతో అద్భుతంగా ఉందని ఎంతో గొప్ప శక్తి క్షేత్రంగా భవిష్యత్తులో వెలసిల్లుతుందని ఒక గొప్ప ధ్యాన కేంద్రంగా మారుతుందని శ్రీమతి తటవర్తి రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ పిఎస్ఎస్ఎమ్ నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, తిరుమల గంగారం, కూనింటి శేఖర్ రెడ్డి, నారాయణ, రాజారాం, సతీష్ యోగ రాజేందర్, పడిగెల మల్లయ్య, గీతాంజలి, రజిని భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ పిరమిడ్ మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love