గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..

–  ప్రిన్సిపల్ ఉషాకిరణ్

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు విద్యార్థులకు శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉషాకిరణ్  మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు .బాలికల కళాశాలలో సీఈసీ గ్రూపులో మొత్తం 22 ,(యస్సి 19, ఎస్టీ 3) ఖాళీలుగా ఉన్నాయన్నారు. శుక్రవారం ఉదయం 10 గం.ల వరకు రామక్కపేట కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.