ఐవోక్యుఎం ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా మ్యాథమెటిక్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ (ఐవోక్యుఎం) ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు శ్రీచైతన్య డైరెక్టర్‌ సీమ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా 365 సెలెక్షన్లు ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థ సాధించిందని వివరించారు. ఏపీ నుంచి 167 మంది, తెలంగాణ నుంచి 47 మంది, కర్నాటక నుంచి 63 మంది, తమిళనాడు నుంచి 28 మంది, నార్త్‌ఇండియా నుంచి 60 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వివరించారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆమె అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ టీచింగ్‌ మెథడాలజీ, సీవో-ఐపీఎల్‌, సీ-ఐపీఎల్‌, ఐకాన్‌ వంటి పటిష్టమైన అకడమిక్‌ కార్యక్రమాల వల్లే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.