శ్రీచైతన్య స్కూల్ సీజ్

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి గురువారం సీజ్ చేశారు. అనుమతి లేని పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలనడుస్తున్న విషయం తెలియడంతో పాఠశాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. దింతో స్పందించిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థుల భవిష్యత్ తో అటలాడుకుంటున్న పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారన్నారు. మండలం పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, శివ కుమార్, తరంగ్, శ్రీకాంత్, వంశీ, చంటి, వినోద్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.