నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎంసెట్-2023 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు రికార్డు సృష్టించారని ఆ సంస్థ ప్రకటించింది. ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంకుతోపాటు టాప్ 10లోపు ఆరు ర్యాంకులను సాధించిందని వెల్ల డించింది. అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10లో ఎనిమిది ర్యాంకులను పొందా మని వివరించింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో ఎస్ అని రుధ్ ప్రథమ ర్యాంకు పొందారని తెలిపారు. ఇంజినీరింగ్‌లో వందలోపు 60 ర్యాంకులు, అగ్రికల్చర్ విభాగంలో వందలోపు 70 ర్యాంకులు తమ విద్యార్థు లు సాధించి సత్తా చాటారని పేర్కొన్నారు. వారిలో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థు లే 67 శాతం మంది ఉన్నారని వివరించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు విభాగాల్లోనూ 19 ఏండ్లుగా అత్యధిక టాప్ ర్యాంక్‌లు, మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థగా శ్రీచైతన్య నిలిచిందని తెలిపారు. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌లో కూడా తమ విజయ పరంపర కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ను, అధ్యాపక బృందాన్ని శ్రీచైతన్య అధినేత డాక్టర్ బిఎస్ రావు అభినందించారు.