ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీధర్‌బాబు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీధర్‌బాబు– ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
నవతెలంగాణ-మల్హర్‌రావు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మేనిపేస్టో చైర్మన్‌, మంథని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్‌ బాబు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లిన ప్రజలు దుద్దిళ్లకు బ్రహ్మరథం పడుతూ పూలవర్షంతో ఘన స్వాగతం పలుకు తున్నారు. ముఖ్యంగా మహిళల మంగల హారతులతో స్వాగతం పలుకుతున్నారు. యువత బైక్‌ ర్యాలీలతో సుస్వాగతం పలుకుతు న్నారు. ఇక శ్రీధర్‌ బాబు విజయం తథ్యమే కానీ భారీ మెజార్టీ కోసమే తమ తపనని యువత, అభిమానులు పరితపిస్తున్నారు. పల్లెల్లో దుద్దిళ్ల ప్రచారనికి ఎక్కడికెళ్లినా జై కాంగ్రెస్‌ జై శ్రీధర్‌ బాబు నినాదాలతో హౌరెత్తిస్తున్నారు. గురు వారం కమాన్‌పూర్‌, సిద్దిపల్లే, జూలపల్లి, గుండారం గ్రామల్లో ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఇందిరమ్మ రాజ్యం రాబోతుం దని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివద్ధే కాంగ్రెస్‌ ధ్యేయమని దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. కార్నర్‌ మీటింగుల్లో ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తున్నదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు, కౌలురైతులు తదితరులకు ఆరు గ్యారెంటీలతో పాటు పలు డిక్లరేషన్లను అమలు చేయడం జరుగుతుందని హామీనిచ్చారు.