వర్సిటీ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ చైర్మెన్‌గా శ్రీధర్‌కుమార్‌ లోధ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ నూతన కమిటీ ఎన్నికైంది. ఈ జేఏసీ నూతన చైర్మెన్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌ లోధ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ మంగళవారం జూమ్‌లో సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా రాజేష్‌ కన్నా, చైర్‌పర్సన్‌గా పల్లా రేష్మారెడ్డి, వర్కింగ్‌ చైర్మెన్‌గా డాక్టర్‌ రామేశ్వరరావు, కో చైర్మెన్‌గా డాక్టర్‌ ఎస్‌ రవికుమార్‌తోపాటు మరో 47 మందిని ఎన్ను కున్నారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యుల రైజ్‌ చేయాలని కోరుతూ దశలవారీగా కార్యాచరణను రూపొందించారు. బుధవారం ఉన్నత విద్యామండలి అధికారులను కలుస్తారు. ఈనెల 22న వినూత్న నిరసన, 23న పరిపాలన భవనం ముందు ధర్నా, 24న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇస్తారు. 26న కాలేజీల ముందు ధర్నా, 27న వినూత్న నిరసన, 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎస్‌ శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. 29న అధికారులకు వినతిపత్రాల సమర్పణ, 30న విశ్వవిద్యాలయాల్లో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తారు.