జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎస్సై రమేష్‌ కుమార్‌

నవతెలంగాణ-కొడంగల్‌
జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన ఎన్నికైన దౌల్తాబాద్‌ మండల ఎస్సై రమేష్‌ కుమార్‌కు మంగళవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన రమేష్‌ కుమార్‌కు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ ఎన్‌. కోటిరెడ్డి, జెడ్పి చైర్‌ పర్స న్‌ సునీతా మహేందర్‌రెడ్డిల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందుకున్నారు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన ఎస్సై రమేష్‌ కుమార్‌ మా ట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపిక కావడానికి సహకరించిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు తనకు జి ల్లా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం, అవార్డు అందించారన్నారు.