నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి ఎపిఓ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయలను అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపిసిసి శివకుమార్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, సీఏ బేగారి గంగామణి, గ్రామ అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి కళావతి, స్థానిక రైతులు ఆటో సాయిలు, క్షేత్ర సహాయకుడు గోపి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.