కామారెడ్డి అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ పోటీ- రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

నవతెలంగాణ-భిక్కనూర్ : కామారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు, కామారెడ్డి నుండి పోటీ చేయాలని తాను స్వయంగా కోరడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి జరగనున్నట్లు, రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని, కులవృత్తుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. భిక్కనూర్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని, మండల కేంద్రంలో గల పురాతన సిద్ధి రామేశ్వర ఆలయాన్ని రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు మురికి కాలువలు నిర్మించడం జరిగిందని, రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలు సాధ్యం కానీ హామీలను ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి ,జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్ట గౌడ్, సిద్ధి రాములు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజమౌళి, పట్టణ సర్పంచ్ వేణు, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, భూమి రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ నరేష్, ఎంపీటీసీ సభ్యులు చంద్రకళ రాములు ,సువర్ణ ప్రభాకర్, బాబు, సిద్ధి రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు మల్లేశం , మండల భారత రాష్ట్ర సమితి యోజన విభాగం అధ్యక్షులు రంజిత్ వర్మ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ, మండల కో ఆప్షన్ సభ్యురాలు సుల్తానా, భారత జాగృతి నియోజకవర్గ కోఆర్డినేటర్ భాగ్య, నాయకులు మధుసూదన్ రెడ్డి, మంగలి బసవయ్య, డాక్టర్ సత్యనారాయణ, దాబా శేఖర్, నర్సింగరావు, రామచంద్రం, సర్దార్ అలీ ఖాన్, గోపాల్, సుదర్శన్ రమేష్ రెడ్డి రాజిరెడ్డి, సిద్ధ గౌడ్, రాజా గౌడ్, రాజలింగం, సాయ గౌడ్, శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.