నవతెలంగాణ-రెంజల్ : మధ్యాహ్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు మధ్యాహ్న భోజన జెన్సి జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండల తహసీల్దార్ రామచందర్ కు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ ను విడుదల చేయాలని, కొత్త మెనుకు బడ్జెట్ను కేటాయించాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అక్షయపాత్ర కు అప్పజెప్పడాన్ని తక్షణమే విరమించుకోవాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, సుమేద, శిరీష, స్వరూప, మోను బాయ్, లలితా, శోభ, లావణ్య, నాగలక్ష్మి, సాయన్న, సౌందర్య , శబ్బు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.