స్టాక్‌ మార్కెట్ల మెరుపులు

– సెన్సెక్స్‌ 800 పాయింట్ల పరుగు
ముంబయి: కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. మూడు రోజుల వరు స లాభాలతో సెన్సెక్స్‌, నిఫ్టీలు నూతన గరిష్టాలను చేరాయి. శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 803 పాయింట్లు పెరిగి 64,718.56కు చేరింది. ఎన్‌ ఎస్‌ఇ నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 19,189.05 వద్ద ముగి సింది. మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 1800 పాయింట్ల మేర పెరిగింది. వారాంతం సెషన్‌లో సెన్సెక్స్‌-30లో ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్‌ మినహా మిగితా స్టాక్స్‌ అన్నీ లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, టిసిఎస్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతు ప్రధానం గా భారత మార్కెట్లకు కలిసివచ్చింది. గత కొంతకాలంగా దేశీయ మార్కెట్ల లో విదేశీ మదుపరులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10 బిలియన్ల ఎఫ్‌ఐఐలు వచ్చాయని అంచ నా. అంతర్జాతీయంగా ఇతర ఆసియన్‌ మార్కెట్లు కూడా రాణించాయి.