జేఏసీని బలోపేతం చేయండి

– టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలకు పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ)లో చేరి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్‌ యూనియన్‌) అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది. కన్వీనర్‌ వీఎస్‌ రావు (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌), కో కన్వీనర్‌ కత్తుల యాదయ్య (బీకేయూ), బీ నరేందర్‌, బీ దాస్‌ (టీఎమ్‌యూ-థామస్‌రెడ్డివర్గం), అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ) తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ జేఏసీతో కలిసి రావాలని ఇతర కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి, తదుపరి జేఏసీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో పీ రవీందర్‌రెడ్డి (ఎస్‌డబ్ల్యూఎఫ్‌), ఎమ్‌ వెంకట్‌గౌడ్‌, జకరయ్య (ఈయూ) తదితరులు పాల్గొన్నారు.