మొరం మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – మాక్లూర్ : అక్రమంగా తరలిస్తున్న మొరమును అడ్డుకునేందుకు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినందుకు పిర్యాదు దారుడిపై పై మూకుమ్మడిగా 15 మంది దాడి చేసి దేహ శుద్ది చేసిన మొరం మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి కొండ గంగాధర్ పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మాదాపూర్ గ్రామంలోనీ 934, 935 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నారని జిల్లా కలెక్టర్ కు రాజేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా అతని ఇంటి పైకి దాడి చేస్తూ మాకు అడ్డు తగులుతావురా బతుకచ్చిన వాడ నిన్ను టిప్పర్ కింద వేసి తొక్కుతాము అని బూతు మాటలు తిట్టు కుంటూ దారుణంగా దాడి చేశారు. అదేవిధంగా భార్యను కూడా భర్తను అదుపులో ఉంచుకో లేకపోతే నడిరోడ్డులా టిప్పర్ తోటి తొక్కిస్తాము అనేటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు తిడుతూ కొట్టారు. రాజేశ్వర్ దళితుడు కొంతమంది వీడిసి పెద్ద మనుషులు అడ్డుకున్న ఆగకుండా దాడి చేశారు. కనీసం 15 మంది కొట్టారు. వెంటనే ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ పంపి నివారించారు. ఈ విధంగా దారుణమైనటువంటి మాఫియాను జిల్లా కలెక్టర్ కూడా శాసించే స్థితికి రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం అన్నారు.. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తహశీల్దార్, ఆర్ఐ కి తెలియజేసిన వినతిపత్రం ఇచ్చినప్పటికీ కూడా వారు ఏమి చేయని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అస్తులనుకాపడి, దోషులపై కఠిన చర్యలు తీసుకొని, అట్రాసిటీ కేసులు నమోదు చేసి బాధితుడికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా  ఆందోళనలు చేస్తామని అన్నారు.