– వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏ డి ఏ పద్మజ
నవతెలంగాణ – చేర్యాల
రైతులకు నకిలీ విత్తనాలు, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడిఏ కె. పద్మజ అన్నారు.సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను మంగళవారం ఏ డి ఏ పద్మజ, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్. రమేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ నాసిరకం పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విత్తన డీలర్లను హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు.ఈ తనిఖీలలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి.అఫ్రోజ్, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, ఏడి సీడ్ సర్టిఫికేషన్ కమిషనరేట్ అధికారి వి. పృధ్విరాజ్ పాల్గొన్నారు.