బాల్య వివాహాలపై కఠిన చర్యలు

సీనియ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.మాధవి
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాలోని బాల రక్ష భవన్‌లో ములు గు జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమన్వయంతో డిసిపియు, చైల్డ్‌ లైన్‌, సఖి సిబ్బందికి న్యాయవిజ్ఞాన సదస్సు,సమన్వయ సమావేశం నిర్వహిచారు. జిల్లా సంక్షేమాధికారి ఈపి ప్రేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియ సివి ల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ.మాధవి ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణలో క్షేత్ర స్థాయిలో ఎదుర వుతున్న ఇబ్బందులను గురించి క్షేత్ర స్థాయి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసు కున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో చట్టాలపై అవగాహన క ల్పించడానికే జిల్లా న్యాయ సేవాధికా సంస్థ ఆధ్వర్యంలో ఈ న్యాయ విజ్ఞాన సద స్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు, పిల్లల హక్కులను పరిర క్షించడం, వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేలా చేయడమే మన అంద రి ఉమ్మడి లక్ష్యం అని, వారి హక్కుల ఉల్లంఘనలకు కారకులైన వారు ఏలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు జరగడానికి కారణ మైన వారు, బాలల పై శారీరక, మానసిక, లైంగిక హింసకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే. ఓంకార్‌ మాట్లా డుతూ జిల్లా బాల పరిరక్షణ విభాగం ములుగు ద్వారా క్షేత్ర స్థాయిలో బాలల హ క్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. జిల్లా సంక్షేమాధికారిణి ఈపి ప్రేమలత మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా మైనర్‌ బాల లు ప్రేమ పేరుతో మోసపోవడం జరుగుతుందని, అటువంటి బాలికల తరపున మాశాఖ అన్ని విధాలుగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కుమారి జె.సౌఖ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది,ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుపి.కృష్ణవేణి, ఎన్‌.హరికృష్ణ, డి.సంజీవ, చైల్డ్‌ లైన్‌ కోఆర్డినేటర్‌ విక్రమ్‌, సఖి సిఏ (ఇన్చార్జి) కల్పన, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌ లైన్‌, బాల సదనం ములుగు సిబ్బంది పాల్గొన్నారు.