-రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
తెలంగాణ బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారులని ఆదేశించారు.రాచకొండ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి శుక్రవారం రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేరెడ్మెట్ లోని కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ పోలిస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజల సహకారంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని, పోలీసులతో సహకరించాలని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు. అనంతరం నిర్వహించిన క్రైం రివ్యు సమావేశంలో, అన్ని జోన్లలో నేర శాతం తగ్గింపు కోసం చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీఅభిషేక్ మొహంతి , డీసీపీి జానకి, డీసీపీ రాజేష్ చంద్ర, డీసీపీ గిరిధర్ , డీసీపీ అనురాధ, డిసిపి బాలస్వామి, డీసీపీ సాయిశ్రీ, డీసీపీ శ్రీ బాల, డీసీపీ శ్రీనివాస్, డీసీపీి మురళీధర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు డీసీపీ షమీర్, అదనపు డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ లక్ష్మి, ఏసిపిలు, తదీతరులు పాల్గొన్నారు.