బస్సుల కోసం విద్యార్థుల అవస్థలు….

నవతెలంగాణ-రెంజల్:

రెంజల్ మండలం ఆదర్శ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు సమయానికి రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతూ కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సులు సమయానుకూలంగా రాకపోవడంతో బోధన్ డిపోకు చెందిన బస్సులపై సాఠాపూర్ చౌరస్తా వరకు వచ్చి అక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి పాఠశాలలో ఎగ్జామ్స్ ఉన్నాయని, నిజామాబాద్ డిపోకు చెందిన బస్సును కందకుర్తి వరకు సమయానుకూలంగా నడిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.