
విద్యార్థుల రాజకీయ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూనె సురేష్ శుక్రవారం చండూర్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావు కి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నూనె సురేష్ మాట్లాడుతూ దళిత నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించి, డిగ్రీ,లా ఉన్నతమైన విద్యను అభ్యసించటం జరిగిందన్నారు.గత దశాబ్ద కాలం క్రితం నుంచి విద్యార్థి, నిరుద్యోగ,ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు చేసిన అనుభవం ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉచిత విద్య,వైద్యం ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శివన్నగూడం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి, రైతులకు వ్యవసాయ సాగు నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల స్ఫూర్తితో సమాజం మార్పు కోసం, నిరంతరం మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండమల్ల వెంకటేశ్వర్లు, శంకర్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.