నవతెలంగాణ- చండూరు: మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, ఒక సారి మునుగోడు ప్రజలు అవకాశం ఇవ్వాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూనె సురేష్ ఓటర్లను కోరారు. మంగళవారం చండూర్ మండలంలోని లక్కినేనిగూడెం, గుండ్రపల్లి, కస్తాల గ్రామాల్లో ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు నాలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యువకుడికి ఆశీర్వదించి, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడానికి పాటుపడతారన్నారు. యువతకు అవకాశం కల్పించాలని, భవిష్యత్తు తరాలను కాపాడాలన్నారు. తెలంగాణలో ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యల పైన అసెంబ్లీలో తన గలాని విప్పుతానన్నారు. నియోజకవర్గ సమస్యల మీద నిత్యం పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఊరి గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.